జపాన్ అధ్యయన కేంద్రానికి రూ. 15 లక్షలు
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జపాన్ అధ్యయన కేంద్రం అభివద్ధికి జపాన్‌కు చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ రూ. 15 లక్షల నిధులను మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం కేంద్రం సంచాలకుడు ఆచార్య డి.వి.ఆర్ మూర్తి నిధుల మంజూరు పత్రాన్ని వీసీ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా వర్సిటీలో జపాన్ భాష, సంస్కతిని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం సంచాలకుడు ఆచార్య డి.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ 2016 సంవత్సరానికి కేంద్రం నిర్వహణ, అభివద్ధికి ఈ నిధులను వినియోగించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం కేంద్రం ఏర్పాటుకు మిత్సుబిషి సంస్థ రూ. 27 లక్షలు అందించిందన్నారు. ప్రస్తుతం కేంద్రానికి అవసరమైన పుస్తకాలు, గ్రంధాలు, మౌలిక వసతులను సమకూర్చడం జరుగుతుందన్నారు. జపనీస్ డిప్లొమా కోర్సుకు ఆగస్టు 2న ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. పెదవాలే్తరులోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.