సైనస్‌కు సమర్థమైన చికిత్స
హోమియో కౌన్సెలింగ్
నా వయస్సు 22 ఏళ్లు. గత 7 ఏడేళ్లుగా సైనసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాను. రెండేళ్ల క్రితం సమస్య తీవ్రతరమవడంతో శస్త్ర చికిత్సను కూడా చేయించుకోవడం జరిగింది. తరువాత కొన్ని నెలల వరకు బాగానే వున్నా, వ్యాధి మళ్లీ మొదలవుతుండడంతో వాతావరణ మార్పులు ఏర్పడినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నా ఈ సమస్య హోమియో చికిత్స ద్వారా మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయమయ్యే అవకాశం ఉందా?
- భాస్కర్, మంగళగిరి
సైనసైటిస్ దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సంబంధిత వ్యాధి. చల్లని వాతావరణం ఏర్పడిందంటే, దీని బారిన పడినవారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. శస్త్రచికిత్స చేయించిన తరువాత కూడా ఇది మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. అయితే హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది సైనస్‌లోని శ్లేష్మపు పొర శోదమునకు లేదా వాపునకు గురవడాన్ని సైనసైటిస్ అని అంటారు.
కారణాలు: తరచూ జలుబు చేయడం, ఎలర్జీ సమస్యలు, డిఎన్ఎస్ - ముక్కు రంధ్రాల మధ్య గోడ పక్కకు మరలడం, నాజల్ పాలిస్, ఏదైనా దెబ్బ తగలడం వలన సైనస్ ఎముకలు విరగడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం,ఆస్తమా మొదలైన సమస్యలు దీనికి ప్రధాన కారణాలు.
లక్షణాలు: - ముక్కు దిబ్బడ, సైనస్ ప్రభావిత భాగాలలో నొప్పి, ముక్కు ద్వారా చీముతో కూడిన ద్రవాలు బయటకు రావడం, తల నొప్పి. పంటి నొప్పి, దగ్గు, జ్వరం, నీరసం, నోటి దుర్వాసన వంటి లక్షణాలను గమనించవచ్చు.
చికిత్స: శ్వాసకోశ ఇబ్బందులన్నింటిలోకి ప్రధానమైన సమస్య అయిన సైనసైటిస్ వ్యాధికి హోమియోలో పత్యేక రీతిలో సమర్థమైన చికిత్స వుంది. అధునాతమైన జెనెటిక్ కాన్స్టిట్యుషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచి,సైనసైటిస్‌ని సంపూర్ణంగా నివారింపచేయడం పూర్తిగా సాధ్యమవుతుంది.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్