డ్యామ్‌ల పునరుద్ధరణకు రూ.645 కోట్లు
సీడబ్ల్యూసీకి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని 29 పాత డ్యామ్‌ల పునరుద్ధరణకు రూ.645కోట్ల సహాయం అందిం చాలంటూ కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అందించింది. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సెంట్రల్ డిజైన్స్ చీఫ్ ఇంజనీర్ నరేందర్‌రెడ్డి బృందం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వీటిని శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాస్ ఢిల్లీలో కేంద్ర జల సంఘంలోని డ్యామ్ ప్రాజెక్టు డివిజన్ డైరెక్టర్ ప్రమోద్నారాయణ్కు అందజేశారు. కేంద్ర జల సంఘం ఈ ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకుకు పంపనుంది. డ్యామ్ రిమాబిలిటేషన్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు(డ్రిప్–2) కింద ప్రపంచబ్యాంకు ఈ నిధులు ఇవ్వనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో పాత డ్యామ్‌ల పునరుద్ధరణ, ఇతర మరమ్మ తులు చేపడతారు.