32 మంది రెవెన్యూ ఉద్యోగుల బదిలీ
కాకినాడ సిటీ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లోనూ, కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలోనూ పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు 32 మంది బదిలీ అయ్యారు. పరిపాలన సౌలభ్యం కోసం వీరిని బదిలీ చేస్తూ కలెక్టర్ అరుణ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో సీనియర్ అసిస్టెంట్లు 8 మంది ఉండగా.. జూనియర్ అసిస్టెంట్లు 24 మంది ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్లలో కలెక్టరేట్లో ఏ సెక్షన్లో పనిచేస్తున్న ఎ.నయోమి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి, కలెక్టరేట్ ఇ సెక్షన్లో పనిచేస్తున్న ఎంఎంఎల్ సరోజని పెదపూడి తహశీల్దార్ కార్యాలయానికి, జీ సెక్షన్లో పనిచేస్తున్న ఎస్కే పద్మవేణి కరప తహశీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
అలాగే రాజమండ్రి ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న బి.వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎల్ఎంసీ యూనిట్-1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న పి.సర్వేశ్వరమూర్తి, మామిడికుదురు, కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయాల్లో ఎంఆర్‌ఐలుగా పనిచేస్తున్న కట్టా సత్యనారాయణమూర్తి, కె.వీరబాబు, రాజానగరం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వి.శ్రీనివాస్‌రావులను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.