దిల్సుఖ్నగర్ బస్టాండ్లో తుపాకీ కలకలం
హైదరాబాద్(దిల్సుఖ్నగర్): దిల్సుఖ్నగర్ బస్టాండ్లో తుపాకీ కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిపోనకు చెందిన బస్సు డ్రైవర్ నుంచి పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఎస్ఎల్ఆర్ తుపాకీ ఉన్నదన్న సమాచారంతో మలక్పేట పోలీసులు సోదా చేసి స్వాధీనం చేసుకున్నారు.
దిల్సుఖ్నగర్ బస్టాండ్లో శనివారం రాత్రి 7.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.