విద్యావ్యవస్థను పటిష్ట పరుస్తాం
► పాఠశాలల్లో మౌలిక వసతులకు చర్యలు
► రాష్ట్ర మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్ : విద్యావ్యవస్థను పటిష్టపరుస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం రిమ్స్ ఆడిటోరియంలో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. సర్కార్ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2012-13 సంవత్సరంలో ప్రారంభించిన పాఠశాల భవనాలు ఇంకా 146 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, ఆర్వీఎం అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థారుులో ఆధికారులు పరిశీలించకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. పనులు పూర్తి చేయకుండా నిధులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలైనా మినహారుుంపు లేదని స్పష్టం చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు, ఫర్నిచర్ కోసం ప్రతీ నియోజక వర్గానికి ఏసీడీపీ కింద రూ.4 కోట్లు కేటారుుంచామని, త్వరలోనే నిధులు విడుదల అవుతాయని తెలిపారు.
చాలా పాఠశాలల్లో హరితహారం కింద నాటిన మొక్కలు కనిపించడం లేదని, మధాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మండల విద్యాధికారులు పాఠశాలలను పర్యవేక్షించి ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. మండల స్థారుులో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రతి రోజు ఏడు పాఠశాలలను తనిఖీ చేసేలా చూడాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు చదవడం, రాయలేకపోతున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలని ఆదేశించారు. జేసీ కృష్ణారెడ్డి, డీఈవో లింగయ్యలు మాట్లాడుతూ ఈ నెల 31లోగా పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలని, చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జిల్లాలో 25 శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను అమర్చుతున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలకు గ్రేడింగ్ ఇస్తామని అన్నారు.
పదో తరగతి విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోతే సర్దుబాటు చేస్తామన్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులను బయటకు పంపించొద్దని, బంద్‌లు, రాస్తారోకో పేరిట విద్యార్థి సంఘాలు, ఏవరైనా వచ్చినా పంపించొద్దని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, డీఎంహెచ్‌వో చందు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కిషన్, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, వివిధ శాఖ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.