అంటార్కిటికా ఆదుకుంటుంది!
న్యూయార్క్: గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత నగరాలకు ప్రస్తుతం ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఫలితంగా అంటార్కిటికాలో హిమపాతం పెరిగి దాని ఫలితంగా సముద్ర మట్టాలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో తేల్చారు.
అంటార్కిటికాలో వాయు ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణంలో తేమశాతం పెరుగుతుంది. అంటే హిమఖండంలో మంచు పరిమాణం మరింత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియ వల్ల అంటార్కిటికా ఉపరితల ద్రవ్యరాశిలో గమనించదగ్గ మార్పులు వచ్చే ఆధారాలేవీ లభించలేదన్నారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దీని కోసం అంటార్కిటికా ఖండానికి సంబంధించి చారిత్రక ఆధారాలు పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రయోగశాలలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి పరిశోధనలు చేశారు.