Riyo
-
వన్నెల వలయాలు.. సాధించాలి విజయాలు..
విశ్వక్రీడోత్సవంలో భారత్ జయకేతనం ఎగురవేయాలన్న ఆకాంక్షను అందమైన రీతిలో వ్యక్తం చేశారు..స్థానిక దివ్య విద్యా సంస్థల విద్యార్థులు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ క్రీడోత్సవ చిహ్నాలైన వలయాలుగా ఏర్పడ్డారు. సుమారు 900 మంది విద్యార్థులు ఒలింపిక్స్ రింగ్స్ ఆకృతుల్లో కూర్చుని ‘గో ఇండియా గో’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ బర్ల విజయ్, పీడీ కె.వెంకట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – రాజానగరం -
వాళ్ల విమానం వాళ్లకే!
రియో: సొంతగడ్డపై ఈసారి కచ్చితంగా టైటిల్ గెలవాలన్న కసితో ఉన్న బ్రెజిల్ జట్టు కోసం అక్కడి ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లే చేస్తోంది. తమ ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికోసం ప్రత్యేకంగా ఒక బోయింగ్ 737 విమానాన్ని సిద్ధం చేసింది. ఇందులో కేవలం బ్రెజిల్ జట్టు ఆటగాళ్లు, సిబ్బంది మాత్రమే ప్రయాణిస్తారు. వీరికోసం విమానం లోపల అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చారు. ఆ విమానానికి ప్రత్యేకంగా గ్రాఫిటీతో ఆర్ట్ వేయించారు. బ్రెజిల్ సంప్రదాయాన్ని ప్రతిబంబించే ఈ ఆర్ట్ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతుందని భావిస్తున్నారు. గ్రాఫిటీ కళాకారుల ద్వయం ఓజ్ జెమియోస్ ఇందుకోసం 1200 క్యాన్ల స్ప్రే పెయింట్‌ను వినియోగించారు. ఇక బ్రెజిల్ జట్టు జూన్ 12న మొదలయ్యే ప్రపంచకప్ కోసం ఇదే విమానంలో ప్రయాణించనుంది. జట్టులోని ఆటగాళ్లంతా ఈ విమానంలో ఎప్పుడెప్పుడు ప్రయాణిస్తామా అని ఆలోచిస్తున్నారట.