17నుంచి ‘రోబోటిక్స్’ పోటీలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి ఢిల్లీ వారు ఐదేళ్లుగా జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న రోబోటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను ఈ సారి గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్.ఎమ్. అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించ నున్నారు.
17, 18 తేదీల్లో పోటీలు జరుగనున్నాయని సోమవారం నిర్వహించిన పోటీల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.ఎస్.వి.రామాంజనేయులు తెలిపారు. రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌పై ఆసక్తి గల పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోటీలు రెండు దశల్లో జరుగుతాయని తెలిపారు.
మార్చిలో ఢిల్లీలో ఫైనల్స్...
గుడ్లవల్లేరులో గెలుపొందిన విజేతలకు 2014 మార్చి నెలలో ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీలకు అర్హత ఉంటుందని ప్రిన్సిపాల్ అన్నారు. జోనల్ రౌండ్ రెండు రోజులు జరుగనున్నట్లు పేర్కొన్నారు. రోబోటిక్స్ తయారీ, వినియోగ విధానాలపై రోబోసాపియిన్స్ ఇండియా నిపుణులచే వర్క్‌షాప్ నిర్వహిస్తారని చెప్పారు.
ఫైనల్ విన్నర్స్‌కు రూ.లక్ష ...
ఫైనల్స్‌లో గెలుపొందిన విన్నర్స్‌కు రూ.లక్ష నగదు బహుమతితో పాటు ఛాంపియన్ షిప్ టైటిల్, ఐ.ఐ.టి ఢిల్లీలో ఘన సన్మానం పొందే అవకాశం ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఆసక్తి గల వారు నలుగురి సభ్యులతో కూడిన టీమ్‌గా ఏర్పడి 12వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రామాం జనేయులు తెలిపారు. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్స్ జి.వి.వి.సత్యనారాయణ (సెల్: 94414 18252), సిహెచ్.శ్రీహరి(సెల్: 7732021425)ను సంప్రదించాలని కోరారు.