ఏపీలో టోరే, రాక్‌మెన్ పెట్టుబడులు
శ్రీసిటీలో పరిశ్రమల ఏర్పాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు జపాన్‌కు చెందిన టోరే, హీరో మోటార్స్ గ్రూప్‌నకు అనుబంధంగా ఉన్న రాక్‌మెన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు తాము వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు టోరె ప్రతినిధులు వెల్లడించగా, రాక్‌మెన్ ఇండస్ట్రీస్ రూ. 540 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఆ కంపెనీల ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వచ్చే ఏడాది జనవరిలో తమ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. కంపెనీల ప్రతినిధులు కలసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాను దక్షిణ భారతదేశంలో లాజిస్టిక్ హబ్‌గా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు.