‘ప్రైవేట్’లోనూ రిజర్వేషన్ కల్పించాల్సిందే
అనంతపురం రూరల్: ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలని సామాజిక హక్కుల వేదిక నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని వీఆర్ఓ భవన్లో 32 కులాల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు డిమాండ్లపై తీర్మానం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని ప్రతి నిరుపేదకూ భూ పంపిణీ చేపట్టాలన్నారు. మైనారిటీలు, దళితులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సామాజిక హక్కుల వేదిక పనిచేస్తోందని అందులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో సెప్టెంబర్ 1 నుంచి 14వరకు సదస్సులు నిర్వహించనుందని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్, రాగే పరశురాం, బోరంపల్లి ఆంజనేయులు, ఫైలా నరసింహయ్య, సాకే నరేష్, జయంత్, నదీమ్, మైనుద్దీన్, సాలార్‌బాషా, మహబుబ్‌బాషా, నూర్‌మహ్మద్, ఆనంద్, మల్లికార్జున, రాజగోపాల్, లింగమయ్య, జయంత్, దేవేంద్ర, నారాయణస్వామి, చక్రధర్‌యాదవ్, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.