పోర్న్ సైట్లకూ ఓ సెర్చింజన్!
ఇంటర్నెట్ ప్రపంచంలో రోజుకో కొత్త సెర్చింజన్ రావడం కొత్తేమీ కాదు. కానీ.. ఏకంగా బూతు సైట్ల కోసం కూడా ప్రత్యేకంగా ఓ సెర్చింజన్ వచ్చిందంటే నమ్ముతారా? గూగుల్ మాజీ ఉద్యోగులు డెవలప్ చేసిన ఓ టూల్ అచ్చంగా పోర్నోగ్రఫీ కోసమేనట. తమ సెర్చింజన్ రాకెట్లా దూసుకొచ్చిందని, ఈనెల 15వ తేదీన అది ప్రారంభమైందని దాని వ్యవస్థాపకులలో ఒకరైన కోలిన్ రౌన్ట్రీ చెప్పారు.
ప్రస్తుతం అడల్ట్ కంటెంట్‌ను గూగుల్, బింగ్ క్రమంగా తమ సెర్చింజన్ల నుంచి తీసేస్తున్నాయని, అందుకే ఇప్పుడు కొత్తగా దానికోసం ఒక సెర్చింజన్ ఉండాల్సిన అవసరం కనిపించిందని చెబుతున్నారు. గూగుల్‌లో ఎవరైనా వీటికోసం వెతికితే కనపడకపోగా.. హెచ్చరికలు ఉంటాయని, అలాంటివాళ్లు వెంటనే తమ సెర్చింజన్ చూస్తే సరిపోతుందని రౌన్ట్రీ అంటున్నారు. ఇదే సమయంలో యూజర్ల వ్యక్తిగత రహస్యాలను కూడా కాపాడేలా తమ ఇంజన్ ఉంటుందని చెప్పారు. కుకీస్ గానీ, ఇతర యూజర్ ట్రాకింగ్ టెక్నాలజీలను గానీ తాము ఉపయోగించట్లేదని అన్నారు.