రాయల్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్
నరసరావుపేట ఈస్ట్: సర్వ సంస్కతుల సమ్మెళనం భారతదేశం. ఆయా సంస్కృతులను ప్రతిబింబించేలా వివిధ ప్రాంత ప్రజలు వినియోగించే వస్తువులను రాయల్ ఎగ్జిబిషన్ క్రాఫ్ట్ బజార్ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచింది. పట్టణంలోని ఎస్ఎస్అండ్ ఎన్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో పలు వస్తువులు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రజలు వినియోగించే దాదాపు 50 వేల రకాల వస్తువులను ఎగ్జిబిషన్లో ఉంచారు. హైదరాబాద్ మంచి ముత్యాలు, నాగాలాండ్ డ్రై ప్లవర్స్, బెంగాళి (కలకత్తా) చీరలు, మైసూర్ రోజ్ వుడ్ సామాగ్రి, టెర్రికోట మట్టిబొమ్మలు, ఢిల్లీ రెడీమెడ్ వస్త్రాలు ఇలా పలు వస్తువులు ధరల్లో లభ్యమవుతుండటంతో ఈ క్రాప్ట్ బజార్‌కు విశేష ప్రజాదరణ వస్తోంది. వై.వెంకటేశ్వరెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి సమిష్టి కృషితో రెండేళ్ల క్రితం నుంచి ఈ రాయల్ క్రాఫ్ట్ బజార్ ఏర్పాటైంది.