14 మంది మావోయిస్టుల లొంగుబాటు
గడ్చిరోలి: పధ్నాలుగు మంది మావోయిస్టులు గురువారం ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు హో మంత్రి ఆర్.ఆర్ పాటిల్ ఎదుట లొంగిపోతున్నట్లు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతో 16 సంవ్సరాల నుంచి 40 సంవత్సరాలలోపు వారే. లొంగిపోయిన మావోయిస్టులకు సరెండర్ చట్టం కింద ఆర్ధికపరమైన వెసులుబాటు ఉంటుదని ఓ పోలీస్ అధికారి తెలిపాడు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం లొంగుబాటు కార్యక్రమాన్ని కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. లొంగిపోయిన మావోయిస్టలంతా ఇప్పటివరకూ తిప్పాగాడ్ దళం, భమ్మరా గాడ్ దళల్లో పనిచేశారు.