నష్టాలను తగ్గించుకున్న అదాని పవర్
న్యూఢిల్లీ: అదానీపవర్ ఏకీకృత నికర లాభం స్వల్పంగా తగ్గింది. సోమవారం ఆర్థిక ఫలితాలను ప్రకటించిన అదానీ పవర్ లిమిటెడ్ రూ.114 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది రూ. 411 కోట్ల నికర నష్టాలను చవిచూసినట్టు కంపెనీ బీఎసీఈ ఫైలింగ్ లో తెలిపింది. గౌతం అదానీ ఆధ్వర్యంలోని అదాని పవర్ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.5776 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇది రూ.5,751 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు రూ.4,533 కోట్లుగా ఉంది.
దేశ ఆర్థిక వృద్ధిలో విరివిగా అందుబాటులోకి వస్తున్న విద్యుత్ ఉత్పత్తి ఒక కీలకమైన అంశమని అదానీ పవర్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. 2016-17 ఆర్థికసంవత్సరానికి అన్ని ప్లాంట్లలో మరింత వృద్ధిని సాధించే అవకాశంఉందని అదానీ సీఈవో బనీత్ జైన్ చెప్పారు. కార్యనిర్వాహక సామర్ధ్యం మెరుగుదల, ఫైనాన్స్ వ్యయం, సమర్థవంతమైన కార్యకలాపాలు నేపథ్యంలోతాజా త్రైమాసికంలో నికర నష్టాలు గణనీయంగా తగ్గడానిక సాయపడ్డాయన్నారు.