జస్ట్ రూ.1.75 కోట్లు మాత్రమే
*ఫెలైన్ వన్..
*వరల్డ్ నంబర్ వన్!
స్పోర్ట్స్ బైకులను సైతం తలదన్నేలా ఉన్న ఈ హైటెక్ డీలక్స్ మోటారు సైకిల్ ఇప్పటిదాకా ప్రపంచంలో తయారైన అన్ని బైకుల కన్నా ఖరీదైనది. అత్యంత నాణ్యమైన కార్బన్, టైటానియం, విమానాల తయారీకి వాడే అల్యూమినియం లోహాలు, ఫైన్ లెదర్‌తో దీనిని తయారు చేశారు. సరికొత్త టెక్నాలజీని జోడించి అతి తేలికగా ఉండేలా యాకూబా అనే ఇంజనీర్ దీనిని డిజైన్ చేశారు.
మూడు సిలిండర్లతో కూడిన ఇంజన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఫెలైన్ వన్ బైకులను ఒకే ఒక్కసారి.. అదీ 50 బైకులను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెలైన్ మోటార్ సైకిల్స్ కంపెనీ ప్రకటించింది. 2016 మొదట్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది.