2 టన్నుల ఎర్రచందనం స్వాధీనం
కడప: మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగరంలోని ఓ ఎర్రచందనం డంప్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఐదుగురు స్మగ్లరు పట్టుబడ్డారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూరు మండలం అన్నాసాగరం గ్రామంలో ఓ గోదాములో నిల్వ ఉంచిన 2.2 టన్నుల బరువైన 171 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ.2.67 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే, ఎర్రచందనంతో చేసిన పూసలు, మూడు కార్లు, ఆయిల్ ట్యాంకర్, రూ.4.3 లక్షల నగదు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో వెంకట్‌రెడ్డి, మహమ్మద్ అలీ, జంగాల వీరభద్రయ్య, రాజమోహన్‌రెడ్డి, సింహసముద్రం చెంగల్రావు లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.