బ్యాంకుల రీకాపిటలైజేషన్ ఫండ్ కేటాయింపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కోసం కేటాయించిన నిధుల్లో మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది . ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయల కేటాయించిన ప్రభుత్వం రూ22,915 కోట్ల ఫండ్ ను కేటాయించింది. 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నిధులను పంపిణీ చేయనుంది. బ్యాంకుల సామర్థ్యం, క్రెడిట్, నిక్షేపాలు, ఖర్చుల తగ్గింపు తదితర కార్యకలాపాల పనితీరుతో ముడిపడి మిగిలిన మొత్తం నిధుల జారీ ఉంటుందని తెలిపింది.
కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 'ఇంద్రధనుశ్' పథకం కింద ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత సంవత్సరం మూలధనం, వార్షిక వృద్ధి రేటు, గత ఐదు సంవత్సరాలుగా క్రెడిట్ వృద్ధి రేటు ఆధారంగా ఈ కేటాయింపులు చేసినట్టు తెలిపింది. ద్రవ్యత మద్దతు అందించడానికి వీలుగా 75 శాతం నిధులును అందజేయనున్నట్టుస్పష్టం చేసింది.
ఎస్ బీఐ - 230. 85శాతం రూ.7,575 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 133.10 శాతం రూ. 2,816 కోట్లు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా 112.60 శాతం రూ. 1,784 కోట్లు
కెనరా బ్యాంక్ - రూ. 256.40 శాతం రూ. 997 కోట్లు
సిండికేట్ బ్యాంక్ - 256.40 శాతంతో రూ. 1,034 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 1,729 కోట్ల
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ 3,101 కోట్లు
తదితర బ్యాంకులకు మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయలను ఫండ్స్ ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రకటించింది. దీనిపై స్పందించిన నిపుణులు ప్రభుత్వం కేటాయించిన దాని కన్నా బ్యాంకులకు మరింత మూలధనం అవసరపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇవే అంతిమ నిధులు కావాలని, అదనపు నిల్వలు కావాల్సిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని జైట్లీ హామి ఇచ్చిన సంగతి తెలిసిందే.