ప్రవాస భారతీయ దంపతుల విరాళం రూ. 650 కోట్లు
న్యూయార్క్: ప్రవాస భారతీయులు రంజన్ టాండన్, చంద్రిక టాండన్ దంపతులు న్యూయార్క్ యూనివర్సిటీకి 650 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ వారంలో ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు చంద్రిక టాండన్ చెప్పారు.
ఎన్వైయూ పాలిటెక్నిక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరుకు టాండన్ దంపతుల పేరు పెట్టనున్నారు. ఎన్వైయూ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్గా మార్చనున్నారు. పెప్సీ చీఫ్ ఇంద్ర నూయికి చంద్రిక టాండన్ అక్క అవుతారు. అహ్మదాబాద్ ఐఐఎమ్ నుంచి చంద్రిక ఎంబీఏ, ఐఐటీ నుంచి రంజన్ ఇంజనీరింగ్ చేశారు. టాండన్ దంపతులు 37 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు.