ఆడి క్యూ7 పెట్రోల్ వెర్షన్..ధర ఎంత?
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ మేకర్ ఆడి క్యూ7 లో పెట్రోల్ వెర్షన్ కారును లాంచ్ చేసింది. 2.0లీటర్ పెట్రోల్ ఇంజీన్ సామర్ధ్యంతో ‘క్యూ7 40 టీఎఫ్ఎస్’ పేరుతో ఈ లగ్జరీ ఎస్యూవీ కారును మార్కెట్లో ప్రవేశపెట్టినట్టు కంపెనీ సోమవారం వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. 67.76 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఆమోదం లభించినట్టు తెలిపింది.
253 బిహెచ్పి పవర్, 370ఎన్ఎం గరిష్ట్ టార్క్, 6.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం, క్వాట్రో పెర్మనెంట్ ఆల్-వీల్ డ్రైవ్, ఆడి డిస్క్ సెలెక్షన్ ఫీచర్లతోపాటు వర్చువల్ కాక్‌పిట్, స్మార్ట్ ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్ష్స్ తో వస్తున్న ఎస్యూవీ సెగ్మెంట్లో తొలి ఆడిగా నిలవనుంది. ఈ కారు ఇప్పటికే 3.0 టిడిఐ ఇంజిన్‌తో భారతదేశంలో అందుబాటులో ఉంది. తాజాగా కొత్త పెట్రోల్ వెర్షన్లో పెద్దగా మార్పులు లేవు. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, షిఫ్ట్ పాడెల్స్ సహా హైఎండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమాట్ కంట్రోల్, క్రూయిజ్కంట్రోల, ఆటో పార్క అసిస్ట్, 8 ఎయిర్ బాగ్స్ తదితర ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.అంతేకాదు ఫుల్లీ లోడెడ్ టెక్నాలజీ ఎడిషన్‌తో క్యూ 7 ప్రీమియం ప్లస్ వెర్షన్ కూడా అందుబాటులో ఉందని ఆడి వెల్లడించింది.