ఎస్ఆర్నగర్ హెచ్డీఎస్సీ బ్యాంక్ వద్ద చోరీ
ఓ వ్యక్తి దృష్టి మరల్చి అతడి వద్ద ఉన్న భారీ నగదుతో ఉడాయించిన సంఘటన హైదరాబాద్ నగరంలో బుధవారం చోటు చేసుకుంది. దాంతో బాధితుడు ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.... ఎస్ ఆర్ నగర్లోని హెచ్డీఎస్ఎఫ్ బ్యాంక్ నుంచి బాధితుడు రూ.7.40 లక్షలు డ్రా చేసుకుని వెళ్తున్నాడు. ఆ క్రమంలో కొందరు వ్యక్తులు అతడి దృష్టి మరల్చి అతడి వద్ద ఉన్న నగదుతో ఉడాయించారు. దాంతో అతడు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దొంగలు అతడిపై దాడి చేయడంతో అతడు పడిపోయాడు. దీంతో దొంగలు పరారైయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనను వివరించారు. పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.