ఇండిగో మాన్సూన్ ఆఫర్. రూ 745
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రయిట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా మాన్సూన్ ఆఫర్ను ప్రకటించింది. వన్ వే విమానాల్లో దాదాపు రూ. 745 కేటికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ పథకం పరిమిత కాలం అమల్లోఉండనుంది. జూలై 4 లోపు ప్రస్తుత డిస్కౌంట్ ధరల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చే. వీటి ద్వారా జూలై 14, 2017 నుంచి మార్చి 24 , 2018ల మధ్య వచ్చే ప్రయాణించవచ్చని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది.
ఇండిగో వెబ్ సైట్ సమాచారం ప్రకారం అన్ని కలుపుకొని విమాన టికెట్లు జమ్మూ - శ్రీనగర్ మార్గంలో రూ. 745 అగర్తల-గైహతి రూ. 778, చెన్నై- బెంగళూరు రూ.898, అహ్మదాబాద్-ముంబై రూ. 1,048, బెంగళూరు-చెన్నై రూ. 1,059, బెంగళూరు-కొచీ రూ.1,199 బాగ్దోగ్రా-కోలకతా రూ. 1,199ప్రారంభధరలుగా ఉన్నాయి.
అహ్మదాబాద్, అమృత్సర్ బాగ్దోగ్రా, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కొచీ, కోలకతా, మధురై, మంగళూరు, ముంబై నుండి కాని స్టాప్ విమానాలు న చెల్లదు పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, శ్రీనగర్, తిరువనంతపురం, వారణాసి, విశాఖపట్నం నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.