మళ్లీ పెరగనున్న సీఎన్జీ ధర
న్యూఢిల్లీ: ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. ఏప్రిల్లో కిలోకి ఏకంగా రూ.8.2 పెరగవచ్చని సం బంధిత వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో సీఎన్జీ సరఫరా చేస్తున్న ఇంద్రపస్థాన్ లిమిడెట్ గత నెలలో కిలోకి రూ.4.50లు పెంచడంతో కిలో ధర రూ.50.10కి పెరిగింది. దీనిపై నగరవ్యాప్తంగా ఆందోళనలు రావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలుగుజేసుకొని ధరలు ఎం దుకు పెంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఐజీఎల్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. అయితే ప్రపంచ మార్కెట్లో వీటి ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెంచక తప్పల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆ సంస్థ తెలిపింది.