కారులో తరలిస్తున్న రూ. లక్ష స్వాధీనం
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు జిల్లాలో తనిఖీలు మమ్మరం చేశారు. ఆ క్రమంలో శుక్రవారం వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం అన్నాసాగర్ వద్ద కారులో తరలిస్తున్న రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం కారు డ్రైవర్ను పోలీస్ స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.