బెల్ట్‌లో 1.3 కోట్ల బంగారం
తిరువొత్తియూరు: చెన్నై విమానాశ్రయంలో 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ విమానంలో నగరానికి చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ప్రయాణికుల్లో ఒకరైన రాయపేటకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తన నడుముకు కట్టుకున్న బెల్టులో 14 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.