రూ.75లక్షల ఫారెన్ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న మొన్నటి వరకూ బంగారం, ఎర్ర చందనం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు తాజాగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎమిరేట్ విమానంలో దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి నుంచి సోమవారం ఉదయం రూ. 72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.