'హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం'
కరీంనగర్ : 'హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే మీ కార్డు వెనుక ఉన్న నెంబర్ చెప్పండి' అని అడగడంతో కంగారుపడ్డ వినియోగదారుడు నంబర్ చెప్పేశాడు. అంతే.. వెంటనే అతని అకౌంట్లో ఉన్న రూ. 86 వేలు డ్రా అయిపోయాయి. ఆ తర్వాత ఇది గుర్తించిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
ఈ సంఘటన కరీంనగర్ గణేష్‌నగర్‌లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నమిలికొండ రమణాచార్యులకు ఆదివారం ఉదయం ఫోన్ చేసిన ఓ వ్యక్తి తాను ఎస్బీఐ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి ఆయన ఏటీఎం కార్డు బ్లాక్ అయిందనడంతో.. ఆందోళనకు గురైన వినియోగదారుడు తన ఏటీఎం కార్డు వెనుక నంబర్ చెప్పాడు. అనంతరం అకౌంట్లో ఉన్న రూ. 86 వేలు మాయమవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.