రూ.కోటి స్వాహాపై సీబీఐ ఆరా
హిందూపురం అర్బన్ : హిందూపురం రైల్వేసెక్షన్ ఇంజినీరింగ్ కార్యాలయానికి మంగళవారం సీబీఐ పోలీసులు వచ్చి రూ.కోటి స్వాహా కేసుపై విచారణ చేపట్టారు. పిల్లల స్కాలర్‌షిప్‌ల పేరిట రైల్వే సొమ్ము తీసుకున్న నాల్గోlతరగతి ఉద్యోగులను విచారణ చేశారు. కాగా 2014 ఆగస్టు నుంచి 2016 ఫిబ్రవరి వరకు మూడు సెక్షన్లలో 28 గ్యాంగ్‌మెన్, సెక్షన్‌లోని ఉద్యోగులకు వారి వేతనంతో పాటు స్కాలర్షిప్ పథకం కింద మంజూరైన మొత్తంతో పాటు హాస్టల్ స్కీంలకు ఎలాంటి దరఖాస్తు చేయకపోయినా ఈపథకాన్ని వర్తింపజేసి వారి ఖాతాల్లో రూ.45 వేల నుంచి రూ.90 వేలు వరకు కాజేశారు. ఈ వివరాలను ఈ ఏడాది మార్చిలో ‘సాక్షి’ బయట పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది.