ప్రైవేట్ బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ
హైదరాబాద్ నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ వద్ద రెండు బస్సులను సీజ్ చేశారు. అలాగే మన్నెగూడలో పర్మిటీ లేకుండా నడుస్తున్న 9 స్కూల్ బస్సులతోపాటు ఓ ప్రైవేట్ బస్సును అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బస్సులన్ని నిబంధనలకు విరుద్దంగా నడుస్తుని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. తమ శాఖ మరిన్ని తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శుక్రవారం ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో రెండు స్కూల్ బస్సులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లాలో రవాణాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్న 7 స్కూల్ బస్సులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.