రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
కందుకూరు: రాష్ట్రమంతటా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే రంగారెడ్డి జిల్లాలో వరుణ దేవుడు కరుణించాడు. అప్పటి దాకా ఎండ తీవ్రతతో అల్లాడిన ఆ గ్రామస్తులు వర్షం రాకతో ఎంతో సంతోషించారు. జిల్లా కందుకూరు మండలం రచులూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కాగా, శ్రీ రామ నవమి సందర్భంగా గత 95 ఏళ్లుగా తమ పల్లెలో వర్షం కురుస్తోందని స్థానికులు తెలిపారు.