ఫైనాన్స్ కంపెనీలో రూ. 15 లక్షలు గోల్మాల్
పెనుకొండ : పట్టణంలోని ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ కంపెనీలో రూ.15లక్షలు గోల్మాల్ అయినట్లు కంపెనీ మేనేజర్ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఖాతాదారులకు సంబంధించి బంగారు తాకట్టు నగలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు.
అయితే హిందూపురంలోని ఓ జాతీయ బ్యాంకులో జమా చేయమని కంపెనీ సొమ్మును తమ సిబ్బంది బాబా ఫక్రోద్ధిన్, మునీర్ చేతికి చ్చామని ఆ నగదు రూ. 15లక్షలు పక్కదారి పట్టాయని తెలిపారు. విచారణ అనంతరం సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.