మా తుఝే సలాం..
గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థుల నృత్యప్రదర్శనలు అదరహో అనిపించాయి. విభిన్న వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి భావాన్ని నింపాయి.
మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆది వారం జి ల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థు లు బృంద నృత్యాలు ప్రదర్శించి దేశభక్తి భావాన్ని నింపారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఏజేసీ, ట్రైనీ కలెక్టర్‌తో పాటు జి ల్లా అధికారులు చప్పట్లు చరిచి విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షే మ శాఖ విద్యార్థులు ‘ఈ జెండా అమరవీరుల త్యాగఫలం’ అన్న గీతానికి నృత్యం, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేడెట్లు ‘తెలుగింట పాడే జంబూరీ’ నృత్యం, వారు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి.
జిల్లా కేంద్రంలో ని మైనార్టీ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ‘రుధిరనేత్ర అరుణారుణ కదనంతో ’ అం టూ వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యంతో అ ద్భుతంగా నాట్యం చేశారు. గీతం హైస్కూల్, ఆ కృతి ఐస్కౌల్ విద్యార్థులు, నవాబ్‌పేట, దేవరక ద్ర కస్తూర్బా గాంధీ విద్యాలయాల విద్యార్థులు నృత్యాలతో అలరించారు. కార్యక్రమాల అనంతరం కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్‌లు ఆయా పాఠశాలల విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.