S R Nagar Police
-
యువతిపై హాస్టల్ యజమాని అత్యాచారయత్నం
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పరిధిలోని బీకేగూడలో ఉన్న ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్లో ఓ యువతిపై గురువారం లైంగిక దాడి యత్నం జరిగింది. హాస్టల్ యజమాని రవీందర్ యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడబోయాడు. రవీందర్ నుంచి తప్పించుకున్న యువతి ఎస్ఆర్నగర్ పోలీసులను ఆశ్రయిచింది. రవీంద్రపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.... రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు. -
ఎస్.ఆర్.నగర్లో ఏటీఎం చోరీకి యత్నం
హైదరాబాద్: ఎస్.ఆర్. నగర్‌లోని సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో చోరీకి దోపిడి దొంగలు యత్నించారు. ఆ క్రమంలో ఏటీఎం డోర్ ఓపెన్ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తున్నారు. అయితే డోర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో మెషిన్ ను పగలకొట్టేందుకు యత్నిస్తున్న సమయంలో బయట అలికిడి కావడంలో దొంగలు పరారైయ్యారు. డ్రా చేసేందుకు ఏటీఎంకు వచ్చిన వ్యక్తులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఏటీఎం సెంటర్‌కు చేరుకుని ... సీసీ పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.