మునిసిపల్ కమిషనర్ల బదిలీ
కర్నూలు జిల్లా పరిషత్ : జిల్లాలో మునిసిపల్ కమినషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. నందికొట్కూరు మునిసిపల్ కమిషనర్‌గా కేఎల్ఎన్.రెడ్డిని నియమించారు. ఈయన కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1గా పని చేస్తున్నారు.
నందికొట్కూరు మునిసిపల్ కమిషనర్ గా ఉన్న ఎ.శంకర్రావును హైదరాబాద్‌లోని పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆదోని మునిసిపల్ కమిషనర్‌గా ఉన్న వివి.కన్యాకుమారిని మందపేట మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అదే విధంగా గతంలో నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో మేనేజర్‌గా ఉండి ఆముదాలవలసకు బదిలీయైన ఎన్వివిఎస్.నూకేశ్వరరావును తిరిగి మళ్లీ నంద్యాల మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్‌గా నియమించారు. అయితే ఆదోని మునిసిపాలిటీకి కొత్త కమిషనర్‌ను నియమించలేదు.