sagar nagar
-
Eel Fish: పాము చేపను ఎప్పుడైనా చూశారా..?
కొమ్మాది(విశాఖపట్నం): సాగర్‌నగర్ తీరంలో పాము ఆకారంలో ఉన్న ఈల్ చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయి. వీటిని చూసిన పర్యాటకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఇవి పాము ఆకారంలో ఉండే చేపలని వీటిని ఈల్ అని పిలుస్తారని, ఇవి తినేందుకు కూడా ఉపయోగిస్తారని మత్య్సకారులు చెప్పడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: యూట్యూబ్ వీడియోలు చూసి.. అర్ధరాత్రి ఏంచేశాడంటే? -
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు..
కొమ్మాది (భీమిలి): విశాఖలోని సాగర్‌నగర్ తీరానికి శనివారం భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది. ఈ తరహా తాబేలు సాగర జలాల్లో సంచరిస్తుంటాయి. ఇవి గుడ్లు పెట్టేందుకు సముద్రపు ఒడ్డుకు వచ్చే సమయంలో వలలో చిక్కుకుని పడవ చక్రాలకు తగిలి మృత్యువాత పడుతుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కోసారి సముద్రంలో కాలుష్యం ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మరణిస్తుంటాయని పేర్కొన్నారు. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. ‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్ -
బ్యాంకింగ్ రంగంపై గీతంలో యూబీఐ అధ్యయన పీఠం
సాక్షి, సాగర్‌నగర్ : బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులపై నిరంతర అధ్యయానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) అధ్యయన పీఠాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కతూరియా హామీ ఇచ్చారు. యూబీఐ కార్పొరేట్ కార్యాలయం ఉన్నతాధికారుల బృందం బుధవా రం వర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా కతూరియా మాట్లాడుతూ దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు మాట్లాడుతూ గీతం ప్రగతిని వివరించారు. వీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాద్ గాంధీయన్ అధ్యయన కేంద్రం, బ్యాంకింగ్ అధ్యయన కేంద్రం ప్రతిపాదనల గురించి వివరించారు. అనంతరం కతూరియాను వీసీ సత్కరించారు. కార్యక్రమంలో గీతం కార్యదర్శి బి.వి.మోహనరావు, పాలకవర్గ సభ్యుడు హమ్జాకె.మెహది, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కె.వి.గుప్తా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ, యూబీఐ జనరల్ మేనేజర్ ఎస్.ఎస్.చంద్రశేఖర్, ప్రాంతీయ అధికారి కె.ఎస్.ఎన్.మూర్తి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
మిస్టరీ వీడిన జెమినీ విలేకరి హత్యకేసు
విశాఖ : విశాఖ జిల్లాలో గత నెల 26న హత్యకు గురైన జెమినీ విలేకరి జగదీశ్ హత్యకేసు చిక్కుముడి వీడింది. ఈ హత్యకేసులో శ్యాంమోహనరావును ప్రధాన నిందితుడుగా పీఎం పాలెం పోలీసులు గుర్తించారు. భార్యపై అనుమానంతోనే జగదీశ్‌ను హతమార్చినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. పోలీసుల కథనం ప్రకారం జార్ఖండ్ టాటానగర్‌కు చెందిన నిందితుడు శ్యాంమోహన్ రావు గత ఏడాదిగా ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చి, తన భార్యతో నివాసం ఉంటున్నాడు. పొరుగునే ఉన్న కెమెరామెన్ జగదీశ్‌తో పరిచయం ఏర్పడింది. అయితే శ్యామ్ భార్యతో జగదీశ్‌కు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో అతను తిరిగి టాటానగర్ వెళ్లిపోయాడు. ఈ ఏడాది మే 14న శ్యాం భార్య ఆత్మహత్య చేసుకుంది. తన భార్య ఆత్మహత్యకు జగదీశ్ కారణమని కక్ష పెంచుకున్న శ్యాంమోహనరావు అతడిని హతమార్చేందుకు పథకం వేశాడు. బయటకు వెళదాం రమ్మని ఈ నెల 26న జగదీశ్‌ను సాగర్ నగర్ ఏరియా గుడ్లవానిపాలెం తీసుకు వెళ్లి కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు గమనించి జగదీశ్‌ను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు గత నెల 27న మృతి చెందాడు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని వెలికి తీశారు. జార్ఖండ్ లో నిందితుడిని అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం విశాఖలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం పోలీసులు శ్యాంను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శ్యాంమోహనరావుకు రిమాండ్ విధించటంతో జైలుకు తరలించారు.