మరోసారి బాబాగా...
సీనియర్ నటులు విజయ్‌చందర్ మరోసారి సాయిబాబా పాత్రలో నటిస్తున్నారు. ఆయన తొలిసారి బాబాగా నటించిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ విడుదలై ముప్పై ఏళ్లు అవుతోంది. సుదీర్ఘ విరామం తరువాత విజయ్‌చందర్ మళ్లీ బాబాగా నటిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. స్వీయ దర్శకత్వంలో జి.యల్.బి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పతాక సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ -‘‘బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌లో పాటలు, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: భవాని అర్జున్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.ఎస్. రామకృష్ణ.