సీమాంధ్ర విద్యుత్ జేఏసీ చైర్మన్ సాయిబా అరెస్టు
సీమాంధ్ర విద్యుత్ జేఏసీ చైర్మన్ సాయిబాబును విద్యుత్ సౌధ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలో భాగంగా.. విద్యుత్ సౌధ లోనికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి, పంజాగుట్ట పోలీసు స్టేషన్కు తరలించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ప్రజలు పెద్దగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే తాము తమ సమ్మెను 72 గంటలకు పరిమితం చేశామన్నారు.
భవిష్యత్లో తాము విద్యుత్ సమ్మెను బ్రహ్మాస్త్రంగా వాడుతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ మూడు రోజుల్లో తాము విద్యుత్ సంబంధిత సమస్యలపై స్పందించబోమని, అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని సాయిబాబా వెల్లడించారు. పార్లమెంటులో తెలంగాణ తీర్మానం పెడితే మాత్రం నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
మరోవైపు, ఈనెల 14,15 తేదీలలో తిరుమలకు బస్సులు నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ఉద్యోగుల జేఏసీ వాయిదా వేసింది. తిరుపతి ఆర్టీవో కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ గురువారం సమావేశమైంది. టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకే బంద్ వాయిదా వేసుకున్నామని, వారం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది.