సాయి ఆశీర్వాదం
సీనియర్ నటులు విజయ్ చందర్‌కు పేరు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘సాయిబాబా మహత్యం’ ఒకటి. అందులో బాబాగా ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. మరోసారి బాబా పాత్రలో నటిస్తూ, విజయ్ చందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ‘సాయి నీ లీలలు’ సినిమా గురువారం ప్రారంభ మైంది.
‘‘బాబా ఆశీర్వాదం వల్లే మళ్లీ ఆయన పాత్రలో నటించే అదృష్టం దక్కింది’’ అన్నారు విజయ్ చందర్. ‘‘ఈ సినిమాతో విజయ్చందర్గారు నన్ను సంగీత దర్శకుణ్ణి చేశారు. స్వరాలతో పాటు సాహిత్యం సమకూర్చే అవకాశం దక్కడం నా అదృష్టం’’ అన్నారు అనంత శ్రీరామ్. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆదిశేష గిరిరావు, మాటల రచయిత తోటపల్లి మధు పాల్గొన్నారు.