saint andrews university
-
ఎవరీ భారతీయ కుబేరుడు..?
బ్రిటన్లోని స్కాట్లాండ్ సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో చేరనున్న ఓ అమ్మాయికి ఆమె తండ్రి సమకూర్చిన సకల సౌకర్యాలను చూసి బ్రిటన్ పత్రికలు ముక్కున వేలేసుకున్నాయి. కూతురి సపర్యల కోసం భారతీయుడైన ఆ తండ్రి విలాసవంతమైన భవంతిని కొనుగోలుచేయడమేకాకుండా ఆమె అడుగులకు మడుగులొత్తేందుకు 12 మంది ఉద్యోగులను నియమించడం అక్కడి పత్రికల్లో పతాకశీర్షికలకెక్కింది. ప్రిన్స్ విలియమ్స్, అతని భార్య కేట్ మిడిల్టన్ చదివిన సెయింట్ ఆండ్రూస్ వర్సిటీలోనే ఓ భారతీయ కుబేరుడి కూతురు ఎంట్రీ అట్టహాసంగా మారింది. స్కాట్లాండ్లో అత్యంత సుందరమైన భవంతుల్లో ఒకదాన్ని తండ్రి కొనుగోలుచేసి, ఆమెకు బాగా ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించేందుకు ఒక పాకశాస్త్రప్రవీణుడిని, ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఒక పనిమనిషిని, ఆమె డ్రెస్లు, ఆమెకు కావాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచేందుకు మరో మనిషిని, అమ్మాయి ఇంట్లోకి వచ్చేటపుడు వెళ్లేటపుడు తలుపులు తీసి పట్టుకోవడానికి మరో వ్యక్తినీ, ఇలా ఆమెకు దాదాపు అన్ని పనుల్లో సాయపడేందుకు 12 మంది ఉద్యోగులను నియమిం చారు ఆమె తండ్రి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవాలని సిల్వర్ స్వాన్ రిక్రూట్మెంట్ అనే ఓ ప్రముఖ జాబ్ ఏజెన్సీలో ప్రకటన సైతం ఇచ్చారు. బలహీనంగా ఉండకుండా, హుషారుగా ఉండేవారు మాత్రమే కావాలని పేర్కొన్నారు. భవంతిలో పనిచేయనున్న ఉద్యోగులకు వేతనం సైతం భారీస్థాయిలోనే ఉంది. ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.28 లక్షల వేతనం ఇస్తామని ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనేది పెద్ద మిస్టరీ అయ్యింది. ఆ కుటుంబం వివరాలు తెలిసిన వారు సమాచారమివ్వాలని బ్రిటన్ పత్రికలు కోరడం మరో విశేషం. -
కష్టం.. మెదడుకి ఇష్టం
లండన్: కలిసుంటే కలదు సుఖం.. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టాన్ని అయినా జయించొచ్చు.. ఇలాంటి మాటలన్నీ మన పూర్వీకుల నుంచి వింటున్నవే. అయితే కలిసికట్టుగా కాకుండా ఎంతటి విపత్కరమైన పరిస్థితినైనా కష్టపడి ఎదుర్కోవడమే మనిషి మెదడుకి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లిష్ట పరిస్థితులను సొంతంగా ఎదుర్కోవడం ద్వారా మనిషి మెదడు పరిమాణం పెరుగుతుందని బ్రిటన్ లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కునే వ్యక్తులు తమ మేధస్సును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేరని.. దీంతో మెదడు పరిమాణం చిన్నదిగా మారుతుందని వారు గుర్తించారు. మన పూర్వీకులు కూడా కలిసి కట్టుగా సమస్యలను ఎదుర్కొనేవారు.. దీంతో వాళ్ల మెదళ్లు పూర్తి స్థాయిలో వికసించలేదని వివరించారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సామాజిక సమస్యలకు అనుగుణంగా మానవ మెదడు పరిమాణం పెరుగుతూ వస్తోందని సోషల్ బ్రెయిన్ హైపోథిసిస్ అధ్యయనం చెబుతోంది. అయితే ప్రస్తుత అధ్యయనం వీటన్నింటినీ ఖండించింది. -
అధిక నిద్రతో మేధో వర్ఛస్సు
లండన్: రాత్రిపూట కంటినిండా నిద్రిస్తే అలసట మాయం కావడమే కాదు, ముఖంలో మేధస్సు మరింత ఉట్టిపడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యునెటైడ్ కింగ్డమ్లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 190 మంది పిన్నలు, పెద్దలపై ఈ మేరకు అధ్యయనం నిర్వహించారు. టీచర్లకు మంచి తెలివైన విద్యార్థిలా కన్పించాలన్నా, ఇంటర్వ్యూ చేసే వారిపై సానుకూల ప్రభావం చూపించాలన్నా ముందురోజు రాత్రి బాగా నిద్రపోవాలని వారు సూచించారు. వ్యక్తులు ఎంత ఆకర్షణీయంగా ఉన్నారన్న సంగతిని పక్కనపెట్టి, వారి మోములో మేధస్సు ఉట్టిపడానికి ఏంచేయాలనే అంశంపై తాము దృష్టిపెట్టి, అధ్యయనం నిర్వహించినట్లు పరిశోధకులు వివరించారు.