Saiye Daivam
-
సాయే దైవం
షిర్డీ సాయిబాబా భక్తుల అనుభవాలే కథాంశంగా శ్రీనివాస్ జీఎల్బీ దర్శకత్వంలో పొనుగోటి భవానీ అర్జున్‌రావు నిర్మించిన చిత్రం ‘సాయేదైవం’. విజయ్‌చందర్ సాయిబాబాగా నటించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. నిర్మాత పొనుగోటి భవానీ అర్జున్‌రావు మాట్లాడుతూ– ‘‘సాయి సమాధి చెంది వందేళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాబా భక్తులకు కానుకగా త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా మందిరాల్లో చిత్రీకరణ జరిపాం. ఇందులో ఐదు పాటలు, మూడు శ్లోకాలు ఉన్నాయి. వాటికి భక్తులతో పాటు శ్రోతల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది’’ అన్నారు. సుమన్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, ఎల్బీ శ్రీరామ్ నటించిన ఈ చిత్రానికి మాటలు–సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
మరోసారి బాబాగా...
సీనియర్ నటులు విజయ్‌చందర్ మరోసారి సాయిబాబా పాత్రలో నటిస్తున్నారు. ఆయన తొలిసారి బాబాగా నటించిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ విడుదలై ముప్పై ఏళ్లు అవుతోంది. సుదీర్ఘ విరామం తరువాత విజయ్‌చందర్ మళ్లీ బాబాగా నటిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. స్వీయ దర్శకత్వంలో జి.యల్.బి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పతాక సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ -‘‘బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌లో పాటలు, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: భవాని అర్జున్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.ఎస్. రామకృష్ణ.