ఒక ఇల్లు... 102 పాములు!
సమ్‌థింగ్ స్పెషల్
సరదాగా నాల్రోజులు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన ఆ కుటుంబ సభ్యులు భీతావహులు అయ్యారు. ఇంటి నిండా పాములు ఉండటంతో వారికి వణుకు పుట్టింది. హాలు, వంటగది, బెడ్రూమ్ తేడా లేకుండా అన్ని చోట్లా పాములు కనిపించే సరికి వాళ్ల ఒళ్లు జలదరించింది. కెనడాలోని సకట్చ్వాన్ ప్రాంతంలో నివసించే ఒక కుటుంబానికి ఈ అనుభవం ఎదురైంది. విశాలమైన కాంపౌండ్‌తో ఉండే వీరి ఇంట్లోకి కుప్పలు తెప్పలుగా పాములు వచ్చి చేరాయి.
ఏదో ఒకటీ రెండు పాములు అయితే వింత కాదు కానీ... టూర్ నుంచి తిరిగొచ్చిన వీళ్లకు ఇంట్లో ఏకంగా లెక్కలేనన్ని పాములు పాకుతూ కనిపించే సరికి వెన్నుల్లో వణుకు పుట్టింది. అయితే అవేవీ విషపూరితమైన పాములు కావు, ఎమర్జెన్సీ వాళ్లు వచ్చి ఈ విషయాన్ని తేల్చారు. మొత్తం పాములను పట్టి... లెక్క పెట్టగా వాటి సంఖ్య 102 అని తేలింది. బయట అతిచల్లని వాతావరణాన్ని తట్టుకోలేక పాములన్నీ ఇంటిలోకి చేరి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు.
ఖాళీ సీసాలతో కొత్త శోభ!
బెంగళూరుకు చెందిన ఒక టాయ్ కంపెనీ రూపొందించిన ఈ ‘డంక్’ అనే డెకరేషన్ల్యాంప్లకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది. వృథాగా పోయే మెటీరియల్‌తో తయారు చేయగల ఈ ల్యాంప్‌లను రూపొందించినందుకు గానూ సింగపూర్ కంపెనీ ఒకటి అవార్డును ఇచ్చింది. రీ సైకిల్‌కు వెళ్లని గాజు సీసాలకు రంగులు అద్ది... వాటిల్లో చిన్న బల్బ్‌ను అమర్చితే చాలు... ఈ ‘డంక్’ తయారవుతుంది. ఎలక్ట్రిసిటీ సరఫరా కావడానికి వైరు, వీటిని ఉంచడానికి చిన్న పీటలాంటి ఏర్పాటు ఉంటే చాలు.. ఈ డంక్ రంగు రంగుల కాంతి వెదజెల్లడానికి రెడీ అయినట్టే!
మూడ్‌కు తగ్గట్టుగా వివిధ రంగుల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో డెకరేషన్‌కు, కాంతి కోసం ఏర్పాటు చేసుకోవచ్చు. కార్నర్ టేబుళ్లలోనూ, బుక్షెల్ఫ్ల వద్ద, ఖాళీ టేబుళ్ల మీద ఈ డంక్‌ను ఏర్పాటు చేసి చూడండి.. ఇంటికి కొత్త శోభ వచ్చినట్టేనని రూపకర్తలు చెబుతున్నారు. మరి ఒకసారి ట్రై చేయండి, ఇంటికి కొత్త సొబగులు అద్దండి.