బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం వెలిమలమంద గ్రామం మజరా ఉస్మాన్ కుంటలో బుధవారం జరిగిన బాల్య వివాహంపై చెన్నంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మాన్కుంట గ్రామానికి చెందిన కవిత(15)కు అదే గ్రామానికి చెందిన బాదు అనే యువకునితో బుధవారం మధ్యాహ్నం వివాహమైంది.
ఈ విషయం తెలిసిన సీపీడీవో సక్కూబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత తల్లిదండ్రులు విజయ - రతన్నాయక్, బాదు తల్లిదండ్రులు సామ్రాట్ - హేమ, పూజారి చారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి అయినప్పటికీ కవితను పోలీసులు ఉమెన్స్ హాస్టల్లో ఉంచారు. బాదూను వాళ్ల ఇంటికి పంపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.