ఒమన్ ఎయిర్‌పోర్ట్‌కు జీఎంఆర్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒమన్‌లో నిర్మిస్తున్న సలాలహ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు జీఎంఆర్ గ్రూపు సేవలను అందించనుంది. దీనికి సంబంధించి ఒమెన్ ఎయిర్పోర్ట్ అథార్టీస్తో జీఎంఆర్ ఎయిర్పోర్ట్ డెవలపర్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. పోగ్రాం మేనేజ్మెంట్, టెస్టింగ్, ఎయిర్పోర్ట్ సిస్టమ్, ఆదాయాల నిర్వహణ వంటి సేవలతో పాటు ఒమెన్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి నైపుణ్యాన్ని పెంచనున్నట్లు జీఎంఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది.