Salem prison
-
Veerappan: వీరప్పన్ సోదరుడి కన్నుమూత
చెన్నై: గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్(75) కన్నుమూశాడు. గుండెపోటుతో సేలం(తమిళనాడు) ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. మత్తయ్యన్.. ఓ హత్య కేసులో సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మే 1న తీవ్ర గుండెపోటు రావడంతో పోలీసులు, మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. 1987లో ఫారెస్ట్ రేంజర్ చిదంబరంను హత్య చేసిన కేసులో.. ఈరోడ్ జిల్లా బంగ్లాపూడుర్ పోలీసులు మత్తయ్యన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో జీవిత ఖైదు పడగా.. 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. ఈయన్ని విడుదల చేయాలంటూ పలు పిటిషన్లు సైతం తెర మీదకు వచ్చాయి. -
యూనిఫాంలో చిందేసి.. సస్పెండ్ అయ్యాడు
విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి.. అందులోనూ యానిఫాం ధరించి డాన్స్ చేశారు. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దుమారం చెలరేగింది. ఉన్నతాధికారులు సంబంధిత అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. తమిళనాడులోని సేలం జిల్లాలో అత్తూరు సబ్ జైలు డిప్యూటీ జైలర్ శంకరన్ (58) గత నెలలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా యూనిఫాం ధరించి ఆయన డాన్స్ చేస్తుండగా, తోటి అధికారులు ప్రోత్సహిస్తూ తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీశారు. ఈ వీడియోను ఫోస్బుక్లో పోస్ట్ చేయడంతో పాటు వాట్సప్‌లో షేర్ చేసుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో శంకరన్‌ను కోయంబత్తూరుకు బదిలీ చేసి, విచారణకు ఆదేశించారు. సేలం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ షణ్ముగ సుందరం విచారణ చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా శంకరన్‌పై చర్యలు తీసుకున్నారు.