శాలివాహన కార్పొరేషన్‌కు నిధుల విడుదల
సూళ్లూరుపేట : కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ సొసైటీస్ ఫెడరేషన్ బోర్డుకు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి చం రూ.200 కోట్లు నిధులు విడుదల చేయనున్నారని ఫెడరేషన్ బోర్డు డైరెక్టర్ కోట శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని వినాయకుడి గుడి సెంటర్లో ఓ ప్రైవేట్ భవనంలో కుమ్మరి శాలివానుల ఆదివారం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘాన్ని ఏర్పాటుచేసుకుని దానికి నాగేంద్ర అనే వ్యక్తిని చైర్మన్‌గా ఎన్నుకుని 13 జిల్లాలకు డైరెక్టర్లను నియమించారని తెలిపారు. ఈ ఏడాది విడుదల చేయబోయే రూ.200 కోట్లలో జిల్లాకు రూ.15 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఎన్నుకున్న నూతన ఫెడరేషన్ కార్యవర్గం ఈనెల 30వ తేదీన విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మేడా సాయి నారాయణ, గౌరవాధ్యక్షుడు మస్తానయ్య, ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ప్రియవర్ధన్‌బాబు పాల్గొన్నారు.