సీమాంధ్ర జిల్లాల్లో 48 గంటల బంద్..
సాక్షి, న్యూఢిల్లీ: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలుగుజాతిని అప్రజాస్వామికంగా చీలుస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో 48 గంటలు బంద్ పాటించాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం పిలుపునిచ్చాయి. సమైక్యాంధ్ర విద్యార్థి జాక్ అధ్యక్షుడు అడారి కిశోర్‌బాబు మంగళవారం సాయంత్రం ఏపీభవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ని పీఎం చేసుకోవాలన్న కుట్రతోనే ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా విభజించిన కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలికి తగిన బుద్ధి చెబుతామని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు ఏపీ పటేల్ హెచ్చరించారు.