సమైక్యాంధ్ర సింహాగర్జన విజయవంతం
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సింహాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది. విద్యార్థి జేఏసీ సారథ్యం వహించిన ఈ సభకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, అన్ని విభాగాల జెఎసి నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, విజయ్ ప్రసాద్, విజయ్ కుమార్, రమేష్ బాబు, వెంకట్రామయ్య గైర్హాజరయ్యారు.