సమ్మెలోకి రెవెన్యూ ఉద్యోగులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్యాం ధ్రకు మద్దతుగా..ఏపీ ఎన్జీవోలు, వివిధ ఉద్యోగ సంఘాలు గురువారం నుంచి సమ్మెలోకి వెళుతున్నాయని, రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం రెవెన్యూ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వీఆర్ఏ నుంచి తహశీల్దార్ వరకూ అందరూ సమ్మెలో పాల్గొనాలన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగుల కృషిలో రెవెన్యూ ఉద్యోగులు కీలక బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్, సంఘ సభ్యులు శ్రీహరి, వెంకటరావు, రాంబాబు, మహంకాళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.