చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య
శామీర్పేట్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటివరకు ఓ కుమార్తె పూజిత మృతదేహం లభ్యం కాగా, తండ్రి అర్జున్, కొడుకు ధనుష్ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు నగరంలోని సికింద్రాబాద్ రసూల్పూర్ వాసులుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.