మూడు రౌండ్లలోనే ముగిస్తా: విజేందర్
అనుభవజ్ఞుడైన సమిట్ హుసినోవ్ (హంగేరి)ని ఓడించడానికి తనకు అదనపు రౌండ్లు అవసరం లేదని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. శనివారం రాత్రి జరిగే తన మూడో బౌట్లో విజేందర్... హుసినోవ్తో తలపడనున్నాడు. ఈ బౌట్ ఆరు రౌండ్ల పాటు జరుగుతుంది. అయితే గత రెండు బౌట్లలో ప్రత్యర్థులను మూడు రౌండ్లలోనే నాకౌట్ చేసిన విజేందర్ ఈసారి కూడా దాన్నే పునరావృతం చేస్తానని చెబుతున్నాడు.